సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సద్వినియోగం చేసుకోవాలి

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

సద్వినియోగం చేసుకోవాలి ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు

జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్నాయి. ఆయా కంపెనీలు తమకు అవసరమైన మ్యాన్‌పవర్‌ను ఈ వేదికగా ఎంపిక చేసుకోనున్నాయి. ఇక్కడ ఎంపికై న వారికి మంచి జీతం, ఉపాధి అవకాశం లభిస్తుంది. జిల్లాలోని నిరుద్యోగ, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

– శ్రీలక్ష్మి, జీఎం, జిల్లా పరిశ్రమలశాఖ

ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాకు ఇండోర్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశాం. కంపెనీల వారీగా స్టాళ్లు ఏర్పాటు చేయిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు, ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. అభ్యర్థులతో పాటు కంపెనీల ప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. – స్వర్ణలత, డీఎస్‌డీఓ

Advertisement
 
Advertisement
Advertisement