16 నుంచి హెచ్‌పీపీఎల్‌ లీగ్‌ | - | Sakshi
Sakshi News home page

16 నుంచి హెచ్‌పీపీఎల్‌ లీగ్‌

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

16 నుంచి హెచ్‌పీపీఎల్‌ లీగ్‌

గన్‌ఫౌండ్రీ: నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రైవేట్‌ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని విశ్రాంత డీజీపీ గోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆదర్శ్‌నగర్‌లోని బిర్లా ప్లానిటోరియంలో హైదరాబాద్‌ ప్రొఫెషనల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (హెచ్‌పీపీఎల్‌) సీజన్‌ వన్‌ జెర్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు మధురానగర్‌లోని స్పోర్ట్స్‌ ఎరీనాలో మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో సినీ నటుడు సత్యం రాజేష్‌, లీగ్‌ నిర్వహకులు పుట్టపర్తి నవ్యజోతి, విక్రమ్‌ రెడ్డి, భూపాల్‌ రెడ్డి, చగన్‌ లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement