ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కండక్టర్ నిజాయతీ చాటుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఆదివారం ఇబ్రహీంపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు హడవుడిగా దిగుతూ బ్యాగు మరిచిపోయింది. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ ఆ బ్యాగును గుర్తించారు. అందులో రెండున్నర తులాల బంగారు గొలుసు, ఆధార్, ఏటీఎం కార్డులున్నాయి. ఆధార్ కార్డులోని ఫోన్ నంబర్ ఆధారంగా సదరు ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చారు. తిరిగి బొంగుళూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వారి కుటుంబసభ్యులు రాగా బ్యాగును వారికి అందజేశారు. విలువైన వస్తువులు మళ్లీ దక్కడంతో వారు కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ సుజాత కండక్టర్ సీతారాం నిజాయతీని అభినందించారు.
శంషాబాద్ రూరల్: వాగులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలం ననాజీపూర్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఈదులనాగులపల్లికి చెందిన బ్యాగరి హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8న ననాజీపూర్‌లో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చారు. మరుసటి రోజు ఆయన కుమారుడు శ్రీచరణ్ (17) బహర్భూమి కోసం బైక్‌పై వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఆదివారం ననాజీపూర్ శివారులోని వాగు నీళ్లలో శ్రీచరణ్ మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు వాగునీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.


