నల్లబెల్లం, పటిక పట్టివేత | - | Sakshi
Sakshi News home page

నల్లబెల్లం, పటిక పట్టివేత

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

కడ్తాల్‌: నాటు సారా తయారీ కోసం ఉపయోగించే నల్లబెల్లం, పటికను ఎకై ్సజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. సీఐ బద్యానాథ్‌ చౌహాన్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పలు గ్రామాలకు నల్లబెల్లం, పటికను సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఎకై ్సజ్‌ పోలీసులు వాహన సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి ఆమనగల్లు వైపు నల్లబెల్లం, పటికతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 750 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక లభ్యమైంది. ఈ మేరకు వాహనంతో పాటు, రెండు సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు. నిందితులు కేతావత్‌ మోహన్‌, డేరంగుల నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తనిఖీల్లో ఎస్‌ఐ స్వప్న, ఎకై ్సజ్‌ కానిస్టేబుల్స్‌ రామిరెడ్డి, ఉపేందర్‌, అహ్మద్‌, లింగయ్య, శివప్రసాద్‌, సాయి శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement