యువ వైద్యులకు న్యూరోసైన్స్‌స్‌లో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

యువ వైద్యులకు న్యూరోసైన్స్‌స్‌లో శిక్షణ

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

గాంధీఆస్పత్రి: వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, అత్యాధునిక చికిత్స విధానాలపై యువ వైద్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ అలుమ్నీ భవనంలో న్యూరోసైస్సెస్‌ మాస్టర్‌ శిక్షణ సదస్సు నిర్వహించారు. తెలంగాణ న్యూరోసైస్సెస్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ థైర్యవాన్‌, కార్యదర్శి ప్రతాప్‌కుమార్‌, రెనోవా గ్రూప్‌ఆఫ్‌ హస్పిటల్స్‌ సీఈఓ రవీంధ్రనాథ్‌ శనివారం సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎంకే మూర్తి, టీవీఆర్‌కే మూర్తి, సయ్యద్‌అమీర్‌బాషాలు మాట్లాడుతూ.. న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాల్లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్ధులు, రెసిడెంట్‌ వైద్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్‌ శిక్షణ ద్వారా క్లినికల్‌ నైపుణ్యాలు మెరుగుపర్చి, ప్రాధమిక పరీక్షవిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేస్‌ డిస్కషన్‌, మాక్‌ ఎగ్జామినేషన్‌లు నిర్వహించనున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement