ఇబ్రహీంపట్నం: రాయపోల్ మహిళా సహకార పొదుపు సంఘంలో అవకతవకలు జరిగాయంటూ మహిళలు, గ్రామస్తులు శనివారం ఆ సంఘం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆఫీసుకు తాళం వేసి నిరసన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాయపోల్ సేవా పరస్పర సహాయక సహకార పొదుపు(పరిమిత) సంఘం ముప్పై ఏళ్లుగా కొనసాగుతోంది. ఇందులో సుమారు రెండు వేల మంది సభ్యులు డబ్బు పొదుపు చేస్తూ, అవసరాలకు రుణాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొదుపు సంఘం మేనేజర్ ఓం ప్రకాశ్ మహిళల చేత పొదుపు డబ్బులు కట్టించుకుంటున్నారే తప్ప.. ఇటీవల కొత్త రుణాలు ఇవ్వడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. రుణాలు ఎలాగూ ఇవ్వడంలేదు.. తాము జమ చేసిన డబ్బులైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. పలువురు స్థానికులు నచ్చజెప్పడంతో ఆదివారం ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ వద్ద చర్చించేందుకు అంగీకరించారు.
సంఘంలో అవకతవకలు
జరిగాయని ఆరోపణ
కార్యాలయానికి తాళం వేసి నిరసన
నేడు పంచాయతీ వద్ద
చర్చకు అంగీకారం


