బలోపేతం చేస్తామండి | - | Sakshi
Sakshi News home page

బలోపేతం చేస్తామండి

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

అభివృద్ధికి ప్రత్యేక చర్యలు విద్యా వారోత్సవాలకు శ్రీకారం ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు.. వేసవి శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు విద్యార్థులను ఆకట్టుకునేలా..సృజనాత్మకత వెలికి తీసేలా పోటీలు

11న ఎంపికై న పీఎంశ్రీ పాఠశాలలు, గుర్తించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వేసవి శిబిరాలు ప్రారంభించనున్నారు. మంజూరైన నిధులతో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆర్‌పీలు, వలంటీర్లు, విషయ నిపుణల నియామకం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రజలను ఇందులో భాగస్వాములను చేయనున్నారు.

12న పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిబిరాల నిర్వహణ, అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభయ్యే వరకు ఈనెల 15 నుంచి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

13న గ్రామ సర్పంచులతో జిల్లా స్థాయిలో కార్యశాల నిర్వహించి, విద్యా కార్యక్రమాలపై అవగాహన, ప్రజల భాగస్వామ్యం పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్నారు.

14న ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. పాఠశాలలను శుభ్రపరిచి అలంకరించిఇంటింటికీ వెళ్లి ప్రవేశాలపై అవగాహన కల్పిస్తారు. తల్లిదండ్రులు, పోషకులతో సమావేశం నిర్వహించి, విద్యార్థులప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.

15న పాఠశాలల్లో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించడం, ప్రతి స్కూలులో గ్రంథాలయం ఏర్పాటు, బడి, పంచాయతీ, పట్టణ, జిల్లా గ్రంథాలయం అలంకరణ, పఠన, పుస్తక ప్రదర్శనలు చేపట్టనున్నారు.

16న హస్తకళలు, సంగీతం, నృత్యం,నాటకం, సాహిత్యంలో మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారు. పర్యావరణహిత పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తారు. ఉత్తమ ప్రతిభ కలిగిన వాటిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు.

17న జవహర్‌ బాలభవన్‌ దినోత్సవం నిర్వహణ, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపునకు దోహదం చేసే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

సర్కార్‌ బడుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా అడుగులు వేస్తోంది.. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది.

సర్కార్‌ స్కూళ్లపై ప్రభుత్వం నజర్‌

షాద్‌నగర్‌: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేస్తోంది. అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు రోజు వారీగా కార్యక్రమాలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది.

ఏ రోజు ఏం చేస్తారంటే..

Advertisement
 
Advertisement
Advertisement