ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

తుర్కయంజాల్‌: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని తుర్కయంజాల్‌ రైతు సేవా సహకార సంఘం పీఐసీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆదిబట్ల సర్కిల్‌ పరిధి కొహెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందజేస్తామని తెలిపారు. రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంగేటి లక్ష్మారెడ్డి, కొత్త రాంరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు

రానీయొద్దు

శంకర్‌పల్లి: వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్‌ సిటీ ట్రాఫిక్‌ డీసీపీ శివమ్‌ ఉపాధ్యాయ అన్నారు. శంకర్‌పల్లి, మో కిలలోని ట్రాఫిక్‌ కూడళ్లను శుక్రవారం చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌తో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. కూ డళ్ల వద్ద ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలకు అనుగుణంగా వెళ్లేలా పోలీసులు చొరవ తీసుకోవాలని తెలిపారు. రద్దీ ఉండే సమయం, ప్రాంతాల్లో కచ్చితంగా కానిస్టేబుళ్లను కేటాయించాలన్నారు. బైక్‌పై వెళ్లే వారు హెల్మెట్‌, కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరి ధరించేలా చూడాలని చెప్పా రు. నిత్యం డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించాలని, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

చేవెళ్ల: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ట్రాఫిక్‌ డీసీపీ శివమ్‌ ఉపాధ్యాయ అన్నారు. చేవెళ్ల ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ట్రాఫిక్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌తో కలిసి ప్రధాన చౌరస్తాలను పరిశీలించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట చేవెళ్ల ట్రాఫిక్‌పోలీసులు, సిబ్బంది ఉన్నారు.

దోస్త్‌ ఐడీతో నేరుగా

డిగ్రీలో ప్రవేశాలు

షాద్‌నగర్‌రూరల్‌: గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్‌ ఐడీతో నేరుగా ప్రవేశాలు పొందొచ్చని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో ఫేజ్‌లో జరుగుతున్న ప్రవేశాల్లో గిరిజన విద్యార్థినులు తక్షణమే నేరుగా కళాశాలలో ఆఫ్‌లైన్‌ ప్రక్రియద్వారా అడ్మిషన్‌ తీసుకోవచ్చని తెలిపారు. అన్ని సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలన్నారు. మీసేవ, ఆన్‌లైన్‌లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం గిరిజన విద్యార్థినులకు మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులు బీజెడ్సీ, ఎంజెడ్సీ, బీఏ, బీకాం, ఎంపీసీ, ఎంపీసీఎస్‌, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు 97034 41345, 81252 14019, 80085 90318, 99595 25459 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఆక్వా రైతులకు

ప్రభుత్వం అండ

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆక్వా రైతులకు ప్రభు త్వం అండగా నిలుస్తుందని, ఇందుకోసం అనే క రకాల పథకాలను తీసుకొచ్చిందని జిల్లా మ త్స్యశాఖ అధికారి పూర్ణిమా సింగ్‌ పేర్కొన్నా రు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రగతి ప్రణాళికలో భాగంగా మత్స్య ప్ర గతిపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆర్‌ఏఎస్‌ పద్ధతిలో చే పల పెంపకం బాగుందన్నారు. చేపలను చెరువుల్లో పెంచే విధానంపై అవగాహన కల్పించారు. చెరువులు కాలుష్యానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్య క్రమంలో ఇరిగేషన్‌, హార్టికల్చర్‌, భూగర్భ జలశాఖ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రావేత్తలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement