ఆమనగల్లు: ఎంపీడీఓగా పనిచేస్తున్న కుసుమమాధురికి పదోన్నతి లభించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమెనువికారాబాద్ జిల్లా డీఆర్‌డీఏ డీవీఓగా ప్రభుత్వం నియమించింది.
ముఖ్యమంత్రితో భేటీ
మాడ్గుల: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని శుక్రవారం రాష్ట్ర గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులైన సూదిని రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని సీఎం నివాసంలో సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు తాండ్ర సాయిరెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


