డంపింగ్‌యార్డులో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌యార్డులో చెలరేగిన మంటలు

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

డంపింగ్‌యార్డులో చెలరేగిన మంటలు ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట దగ్ధం ఆటలు, చదువులో అరుణతేజం క్రీడా పాఠశాలకు రిషికేష్‌

ఆమనగల్లు: డంపింగ్‌యార్డులో మంటలు చెలరేగాయి. పట్టణ సమీపంలోని నివాసాల మధ్య డంపింగ్‌యార్డు ఉంది. శుక్రవారం సాయంత్రం సిబ్బంది చెత్తను కాల్చడానికి నిప్పు అంటించినట్లు తెలుస్తోంది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి విపరీతమైన పొగ రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే కల్వకుర్తి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది డంపింగ్‌యార్డు వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

కేశంపేట: ప్రమాదవశాత్తు మంటలు వ్యాప్తి చెంది మొక్కజొ న్న పంట దగ్ధమైంది. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తలసాని రంగారెడ్డి తమ వ్యవసాయ పొలంలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశాడు. శుక్రవారం పంటతో పాటు డ్రిప్‌ పైపులకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగింది.

కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్నెకోట అరణ్‌తేజ్‌ క్రికెట్‌తో పాటు చదువుల్లో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ తరఫున అండర్‌ 19 క్రికెట్‌ అడుతున్న అరుణ్‌తేజ్‌ బెంగళూర్‌లో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఐటీఎం ప్రవేశ పరీక్షలో మూడో ర్యాంకులో నిలిచి, మద్రాసు ఐఐటీలో సీటు సాధించాడు. క్రీడలతో పాటు చదువులోనూ రాణిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పరిగి: పరిగి పట్టణానికి చెందిన రిషికేష్‌ క్రీడా పాఠశాలకు ఎంపికయ్యాడు. శుక్రవారం విడుదలైన రాష్ట్రస్థాయి ఎంపిక ఫలితాల్లో పరిగి 13వ వార్డుకు చెందిన ఆర్‌ రిషికేష్‌ ప్రతిభ కనబరిచారు. 4వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించారు.

కుల్కచర్ల నుంచి అక్షర

కుల్కచర్ల: క్రీడా పాఠశాలకు మండల విద్యార్థిని అక్షర ఎంపికయ్యారు. చెల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన అక్షర క్రీడా పాఠశాలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాడుడు ఆనంద్‌కుమార్‌, తోటి విద్యార్థినులు అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement