రాయదుర్గం: రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అపోలో ఆస్పత్రిలో క్రీడాగాయాలకు సంబంధించిన ప్రత్యేక కేంద్రాన్ని అధికారులు, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రీడాకారులతో కలిసి ప్రారంభించారు. క్రీడల్లో గాయపడ్డ వారికోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు.
వరుణ్ అరుణ్ సూచనలు తీసుకోవాలి
సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జయేష్‌రంజన్ సూచించారు. అతను జహీర్‌ఖాన్, ఉమేష్‌యాదవ్, ఆశిష్‌నెహ్రల కంటే వేగంగా వేసే ఫాస్ట్ బౌలరని, కానీ ఎప్పుడూ ఫిట్‌గా ఉండేవాడన్నారు. నేటి సన్‌రైజర్స్ ఆటగాళ్ళు, ఇతర ఫాస్ట్ బౌలర్లు కూడా అతని ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో ఎలా గాయాలపాలు కాకుండా ఉండాలో నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ దీప్తి నందన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం సన్‌రైజర్స్ క్రీడాకారులతో ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్


