పూడూరు: షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ షాప్ దగ్ధమైన ఘటన మండలంలోని కంకల్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రదీప్ కంకల్ ప్రధాన రహదారి పక్కన రేకుల షెడ్డులో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం దుకాణం నుంచి దట్టమైన పొగలు వస్తుండటంతో స్థానికులు ప్రదీప్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే షాప్‌లోని వస్తువులు, ఫోన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు నష్టం జరిగిందని ప్రదీప్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది.


