దుద్యాల్: పాఠశాలలకు సెలవులు కావడంతో గ్రామాల్లోని చిన్నారులు ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. కొంత మంది ఇండోర్ ఆటలు ఆడుతుండగా.. మరికొందరు అవుట్ డోర్ గేమ్స్‌లో బిజీగా కనిపిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చెట్టుపల్లితండాలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మండుటెండలో వినోదం ఒక్కోసారి ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ఆరుబయట ఆడుకునే ఆటలకు ఉదయం, సాయంత్రం వేళలే మేలు. పిల్లలూ.. ఎండతో కాస్త జాగ్రత్త.
చెట్టుపల్లితండాలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు


