జిల్లాలో మైనింగ్ తవ్వకాలు ఇలా(మెట్రిక్ టన్నుల్లో)
మైనింగ్ ద్వారా వచ్చిన ఆదాయం(రూ.లక్షల్లో..)
జిల్లాలో మైనింగ్ లీజులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కోకాపేటలోని ప్రభుత్వ భూమిలో ఓ నిర్మాణ సంస్థ ఏకంగా 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేసింది. కానీ ప్రభుత్వానికి పైసా కూడా రాయల్టీ చెల్లించలేదు. కోహెడలో ఓ నిర్మాణ సంస్థ గుట్టను తొలిచి, అక్కడే అక్రమంగా క్రషర్‌ను ఏర్పాటు చేసింది. రూ.5కోట్ల జరిమానా విధించినా నేటికీ పైసా వసూలు చేయలేకపోయారు. శంషాబాద్, కొత్వాల్‌గూడ, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, శంకర్‌పల్లి (111జీఓ పరిధి) పరిసర ప్రాంతాల్లో 20పైగా మొబైల్, ఫిక్స్‌డ్ క్రషర్లు, రెడీమిక్స్(ఆర్‌ఎంసీ)ప్లాంట్లు ఉన్నాయి. వీటికి రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, స్థానిక సంస్థల నుంచి కనీస అనుమతులు లేవు. కళ్లముందే ఎత్తైన కొండలను ఏళ్లుగా పిండి చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఇక బండరావిర్యాలలో, చిన్నరావిర్యాల, కొత్తూరు, యాచారం, తలకొండపల్లిలోని లీజుదారులు ఒకే ట్రాన్సిట్ పాస్, వే బిల్లును పదేపదే ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు. బాలాపూర్ దేవతలగుట్టపై సైతం అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. క్వార్జ్, ఫ్లెడ్‌స్పార్, స్టోన్ మెటల్స్, లేటరేట్, గ్రావెల్, కలర్ గ్రానైట్ వంటి విలువైన ఖనిజాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా గనుల తవ్వకాలపై దృష్టిసారించాల్సిన మైనింగ్ విభాగం అధికారులు లీజుదారులతో కుమ్మకై ్క.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఫలితంగా 2023–24లో జరిపిన మైనింగ్ తవ్వకాలు, రాబడితో పోలిస్తే.. 2024–25లో భారీ వ్యత్యాసం నమోదైంది.
అనుమతులకు మించి తవ్వకాలు
జిల్లాలో 279.854 హెక్టార్ల విస్తీర్ణంలో 51 క్వార్జ్‌మైన్స్, ఇక 496.83 హెక్టార్ల విసీ్త్రర్ణంలో 84 స్టోన్ అండ్ మెటల్స్ మైన్స్, 22.9 హెక్టార్ల విసీ్త్రర్ణంలో 12 బ్లాక్ గ్రానైట్ మైన్స్, ఐదు హెక్టార్ల ప్రభుత్వ భూమిలో కలర్ గ్రానైట్ మైన్ ఉంది. 53.490 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో మూడు లేటరైట్ గనులు ఉన్నాయి. మెజార్టీ లీజుదారులు అనుమతులకు భిన్నంగా తవ్వకాలు జరిపి, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. కొండంత తవ్వకాలు చేపట్టి.. లీజు, రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి అంతంతే చెల్లిస్తున్నారు. తవ్వకాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన మైనింగ్ అధికారులు లీజుదారులతో కుమ్మకై ్క.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ విభాగం విచారణలోనూ ఇదే అంశం స్పష్టమైంది. అక్రమ మైనింగ్, లైసెన్సులు లేని క్రషర్ మిషన్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లపై చర్యలకు ఆదేశించడంతో గౌలిదొడ్డి, వట్టి నాగులపల్లి, గోపన్‌పల్లి, శంషాబాద్, కొత్వాల్‌గూడలోని ఎనిమిది క్రషింగ్ యూనిట్లు, 12 రెడీమిక్స్ ప్లాంట్లను హైడ్రా కూల్చివేసింది. అయితే ఓఆర్‌ఆర్‌కు సమీపంలో అజీజ్‌నగర్‌లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ రెడీ మిక్స్‌ప్లాంట్‌పై చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతులకు మించి తవ్వకాలు.. రాయల్టీ ఎగవేత
జిల్లాలో భారీగా అక్రమ మైనింగ్..పట్టించుకోని వైనం
2023తో పోలిస్తే భారీగా పడిపోయిన ఆదాయం
ఖనిజం 2022–23 2023–24 2024–25
క్వార్ట్జ్ 3,27,450 3,25,043 3,37,616
ఫ్లెడ్‌స్పార్ 3,46,257 3,16,572 1,76,710
స్టోన్ మెటల్స్ 50,12,278 26,13,916 20,51,031
లేటరైట్ 3,16,019 5,04,212 4,71,628
గ్రావెల్ 1,80,091 1,50,325 2,59,032
కలర్ గ్రానైట్ – 25.826 46.627
తాత్కాలిక అనుమతులు ద్వారా
స్టోన్ అండ్ మెటల్ 2,36,500 4,71,000 9,61,450
మట్టి తవ్వకాలు 8,80,700 3,02,500 8,46,430
ఖనిజం 2022–23 2023–24 2024–25
క్వార్ట్జ్ 287.27 586.92 363.83
ఫ్లెడ్‌స్పార్ 358.89 643.06 493.84
స్టోన్ మెటల్స్ 3661.20 3240.41 3259.54
లేటరైట్ 395.04 1230.80 1144.79
గ్రావెల్ – 1230.80 1144.79
బ్లాక్ గ్రానైట్ 59.87 41.62 2.14
కలర్ గ్రానైట్ – 28.52 0.02
తాత్కాలిక అనుమతుల ద్వారా
స్టోన్ అండ్ మెటల్ 154.37 551.07 1083.67
మట్టి తవ్వకాలు 886.94 108.90 35.34
స్టోన్ అండ్ మెటల్స్ 84
క్వార్ట్జ్ అండ్ ప్లెడ్‌స్పార్ 51
లేటరైట్ 03
గ్రానైట్ 12
మొత్తం 150


