సిద్ధాపూర్‌లో డంపింగ్‌యార్డు వద్దు | - | Sakshi
Sakshi News home page

సిద్ధాపూర్‌లో డంపింగ్‌యార్డు వద్దు

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

కొత్తూరు: సిద్ధాపూర్‌ గ్రామ శివారులో ప్రభుత్వం సేకరించిన పొలాల్లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్‌రెడ్డి పలువురు సర్పంచ్‌లతో కలిసి గురువారం ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు సేకరించిన పొలాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అంతేతప్పా హైదరాబాద్‌ పరిసర ప్రాంత చెత్త, వ్యర్థాలను తెచ్చి డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తామంటే మాత్రం వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే సమీపంలోని కొడిచర్ల, ఎస్‌బీపల్లి, ఇతర తండాలు కాలుష్య భరితంగా మారుతాయన్నారు. ఇక్కడి ప్రజలు అనారోగ్యాలు, ఇతర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎర్రొళ్ల జగన్‌, గోవింద్‌నాయక్‌, బాసునాయక్‌, శ్రీరాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement