హనుమ | - | Sakshi
Sakshi News home page

హనుమ

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026 భూములు

న్యూస్‌రీల్‌

దేవాదాయ శాఖ నివేదిక ఆధారంగా

గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
భూములు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు.. రామనామం జపించని వాడ ఉండదనే నానుడి. ఇలా ఊరిని కాపాడే అంజన్న భూమలకే నేడు రక్షణ కరువైంది. భగవంతునికి, భక్తులకు అనుసంధానంగా ఉండాల్సిన పూజారి కుటుంబం, ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కలిసి ఏకంగా దేవుడికే శఠగోపం పెడుతున్నారు. అడ్డదారుల్లో ఓఆర్‌సీ(ఆక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్‌)లు సృష్టించి.. విలువైన భూములను గుట్టుగా అమ్మకానికి పెట్టింది. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.కోటి పలికే ఈ భూములను అగ్గువకే కొట్టేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు, రియల్టర్లు తెరవెనుక పావులు కదుపుతున్నారు. తీరా ఈ విషయం బయటికి పొక్కి.. గ్రామస్తులు ఆందోళనకు దిగడం, భూములను రక్షించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

దేవుడికే శఠగోపం

మాడ్గుల మండలం ఆర్కపల్లి రెవెన్యూ సర్వే నంబర్‌ 88, 241, 242, 283లలో మొత్తం 33.20 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణకు ఈ భూములు కేటాయించారు. ఇక్కడ లక్ష్మయ్య అనే పూజారి చాలాకాలం పని చేశారు. దీంతో అప్పటి రెవెన్యూ అధికారులు ‘కాస్తు’కాలంలో లక్ష్మయ్య పేరును నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన వారసులు హైదరాబాద్‌ వెళ్లారు. నాటి నుంచి ఈ గుడి బాధ్యతలను గ్రామస్తులే చూసుకుంటున్నారు. రెవెన్యూ ‘కాస్తు’ కాలంలో పూజారి లక్ష్మయ్య పేరు నమోదు చేసి ఉండటాన్ని వారసులు అవకాశంగా తీసుకున్నారు. అప్పటికే ఈ భూములపై కన్నేసిన అధికారపార్టీ పెద్దలు, రియల్‌ మాఫియా పరోక్షంగా వారసులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు కు రెవెన్యూ యంత్రాంగం చేయి కలిపింది. దీంతో నకిలీ ఓఆర్‌సీలు బయటికి వచ్చాయి. ఓఆర్‌సీ ఇనాం భూములకు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ పూజారి కుటుంబానికి ప్రభుత్వం కానీ, దేవాదాయశాఖ కానీ ఎలాంటి ఓఆర్‌సీలు జారీ చేయలేదు.

నివేదిక బయటికి రాకుండా..

1854–1954 సర్వే సెటిల్‌మెంట్‌ నుంచి ఈ భూమి ఆంజనేయ స్వామి ఆలయం పేరిటే ఉంది. ప్రస్తుత భూ భారతి పోర్టల్‌లోనూ ఇదే పేరుతో నమోదై ఉంది. ఈ భూమి పూర్తిగా దేవాదాయశాఖకు చెందినదిగా స్పష్టమవుతోంది. కానీ ఆ పూజారి కుటుంబం దేవుడి ప్రసాదం తినమంటే ఏకంగా దేవుడి భూములనే మింగేందుకు యత్నిస్తోంది. 50 ఏళ్ల క్రితం ఊరును వదిలేసి వెళ్లిన సదరు పూజారి కుటుంబానికి భూభారతి పోర్టల్‌కు భిన్నంగా ఓఆర్‌సీ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అప్పటి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ పనితీరుపై స్థానికులు రెవెన్యూ, సహా ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీఓ నేతృత్వంలోని రెవెన్యూ ట్రిబ్యునల్‌ ఇప్పటికే ఈ అంశంపై విచారణ పూర్తిచేసింది. కాగా ఇప్పటి వరకు నివేదికను బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్కపల్లి ఆంజనేయ స్వామి ఆలయం

ఆలయ మాన్యం అమ్మకానికి కుట్ర

పూజారి కుటుంబం, అధికార పార్టీ నేతల మాయాజాలం

కొంతమంది అధికారుల సహకారంతో నకిలీ ఓఆర్‌సీల సృష్టి

హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు

ఆర్కపల్లి ఆంజనేయస్వామి భూముల ఓఆర్‌సీ జారీ అంశంపై విచారణ చేపట్టాం. 2014 పహానీల్లో ఆంజనేయస్వామి ఆలయం పేరున నమోదై ఉంది. అయితే అంతకు ముందు పహానీల్లో మాత్రం ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ అంశాన్ని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ఆ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు విచారణ నివేదికను పెండింగ్‌లో పెట్టాలని భావించాం. వివాదాస్పద భూముల్లో అగ్రిమెంట్లు జరిగిన విషయం నాకు తెలియదు. భూభారతి పోర్టల్‌లోనూ ఈ భూములను ఆంజనేయస్వామి పేరునే నమోదు చేసి ఉంచాం. – అనంతరెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం

Advertisement
 
Advertisement
Advertisement