ఆమనగల్లు: పట్టణానికి చెందిన రమేశ్ బుధవారం మృతిచెందడంతో లయన్స్‌క్లబ్ సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో మరో ఇద్దరికి దృష్టిభాగ్యం కల్పించారు. మృతిచెందిన రమేశ్ కుటుంబ సభ్యులను లయన్స్‌క్లబ్ జిల్లా చైర్మన్ అర్థం మనోహర్, అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల అంగీకారంతో రమేశ్ కళ్లను హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అప్పగించారు. నేత్రదానం చేసిన రమేశ్ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ సభ్యులు గంప శ్రీనివాస్, పాషా, దివంగత రమేశ్ కుటుంబ సభ్యులు పారిజాత, లక్ష్మీశ్రీనివాస్, వంశిత, నరేందర్, నవీన్, రంజన తదితరులు ఉన్నారు.


