108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం | - | Sakshi
Sakshi News home page

108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

షాబాద్‌: 108 వాహనంలో ఓ తల్లి ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. షాబాద్‌ 108 సిబ్బంది రాజేశ్‌, భూపాల్‌ సెల్పులు తెలిపిన ప్రకారం బిహార్‌కు చెందిన ఓ జంట ఎలికట్ట గ్రామంలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కుమారికి మధ్యాహ్నం పురిటి నొప్పులురావడంతో ఆమె భర్త 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో ఆమెను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువవడంతో సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం షాద్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement