మర్రి చెట్ల తొలగింపు.. భారీగా ట్రాఫిక్‌ జాం | - | Sakshi
Sakshi News home page

మర్రి చెట్ల తొలగింపు.. భారీగా ట్రాఫిక్‌ జాం

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

మర్రి చెట్ల తొలగింపు.. భారీగా ట్రాఫిక్‌ జాం ఆశీర్వాదం

మొయినాబాద్‌: హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మొయినాబాద్‌ సమీపంలో మర్రి చెట్లు తొలగిస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మొయినాబాద్‌ సమీపంలోని తాజ్‌ సర్కిల్‌ వద్ద సోమవారం సాయంత్రం నుంచి జేసీబీలతో తవ్వి మర్రిచెట్లను మరో చోట ట్రాన్స్‌లొకేట్‌ చేసేందుకు తరలిస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. రాత్రి 8 గంటల వరకు భారీగా వాహనాలు నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

శంకర్‌పల్లి: పట్టణానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు సోమవారం నిర్వహించిన తన కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement