చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మధన్‌మోహన్‌రెడ్డి, కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రమేశ్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యకళాశాల విద్యార్థులె ‘ట్రోయ్ జియాంజ్’ పేరుతో గ్రాడ్యుయేషన్ ఘనంగా నిర్వహించారు. వేడుకలను శాసనమండలి చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్‌ఆర్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ వరదారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి ముఖ్యఅతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యవృత్తి చెప్పటిన విద్యార్థులు వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యంలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి విద్యార్థి నిరంతర పరిశోధకుడిగా ముందుకు సాగాలని, తల్లిదండ్రులు కష్టాన్ని మరిచిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జోయారాణి, మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ గౌరి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


