పంట భూముల జోలికి రావద్దు | - | Sakshi
Sakshi News home page

పంట భూముల జోలికి రావద్దు

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

పంట భూముల జోలికి రావద్దు

రైతు వారోత్సవాల్లో కర్షకుల ఆందోళన

ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

మొయినాబాద్‌ రూరల్‌: కూరగాయలు, పూల మార్కెట్‌ నిర్మిస్తామంటూ తమ భూముల జోలికి రావొద్దని అజీజ్‌నగర్‌ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోనియాదర్శన్‌, కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, మండల వ్యవసాయ, అభివృద్ధి అధికారులకు విన్నవించారు. సర్వే నంబర్లు 151, 176లోని భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాపోయారు. ఈనిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు చనివెల్లి అమరేందర్‌రెడ్డి, చాకలి యాదగిరి, మాణిక్యం, శంకరయ్య, రైతులు మాడి రాంచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాంభూపాల్‌, నరేందర్‌యాదవ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement