నేడు మరో భూ సర్వే | - | Sakshi
Sakshi News home page

నేడు మరో భూ సర్వే

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

దుద్యాల్‌: గ్రామ శివారు 363 సర్వే నంబర్‌లో 85 మంది రైతులకు సంబంధించి 144 ఎకరాల అసైన్డ్‌ భూములకు అధికారులు సోమవారం ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ కిషన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దుద్యాల్‌ శివారులోని నెమళ్ల కుచ్చ అనే ప్రాంతంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 2025 డిసెంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇటీవల ఆ భూములకు సంబంధించిన రైతుల అభిప్రాయా లు సేకరించారు. వారు భూములిచ్చేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. భూము లు కోల్పోతున్న రైతులు కాస్తులో ఉన్న భూముల దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలని సూచించారు.

భూములు ఇవ్వడానికి వెనకాడని రైతులు

తాండూరు ఆర్డీఓ అనిత, తహసీల్దార్‌ కిషన్‌ భూములు కోల్పోతున్న 85 మంది రైతులతో ఏప్రిల్‌ 10న అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన రైతులు భూము లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. కాస్తులో ఎక్కువ ఉండి రికార్డుల్లో తక్కువ ఉందని, రికా ర్డులో ఎక్కువ ఉండి కాస్తులో తక్కువ ఉన్న రైతులు చాలా మంది ఉన్నారని చెప్పారు. పరిహారం అందజేతకు ముందే వాటిని సరి చేయాలన్నారు. అందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణలో అంగీకారం తెలిపిన రైతులు

144 ఎకరాల అసైన్డ్‌ భూముల అనుభవదారుల గుర్తింపునకు ఎంజాయ్‌మెంట్‌ సర్వే

Advertisement
 
Advertisement
Advertisement