● శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టివేత
శంషాబాద్: సిగరెట్ పెట్టెల్లో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన హైడ్రోపోనిక్ గంజాయిని ఎయిర్ ఇంటెలి జెన్స్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. ఏకే 69 విమానంలో కౌలాలంపూర్ నుంచి శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోహన్ కందన్ అనే వ్యక్తి విలేజ్ అరైవల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు. క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బ్యాగేజీలో సిగరేట్ పెట్టెల్లో 5.8 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని కనుగొన్నారు. నిందితుడు మోహన్ కందన్‌తో పాటు గంజాయిని తీసుకునేందుకు వచ్చిన రిసీవర్ తమిళనాడుకు చెందిన సిద్దిఖ్ అలీ అనే వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు నిమిత్తం వారికి కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.


