బైక్‌ల దొంగల అరెస్టు
మొయినాబాద్‌రూరల్: కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మొయినాబాద్–సురంగల్ రోడ్డు లో క్రైమ్ టీమ్ పోలీసులు గస్తీ తిరుగుతుండగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం గోవింద్‌పల్లికి చెందిన హరిజన రామకృష్ణ, అదే మండలం కొంరెడ్డిపల్లికి చెందిన బద్దుల విజయ్‌కుమార్‌లు యమహా బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో గత ఐదు నెలలు గా మొయినాబాద్‌లో నాలుగు బైకులు, చేవెళ్ల, కూకట్‌పల్లిలో ఒక బైక్ చొప్పున చోరీ చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. చోరీకి గురైన ఆరు బైకులను స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్‌కు తరలించారు.


