బొంరాస్‌పేట: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై కొంత కాలంగా మూగజీవాల తరలింపు, అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, కర్ణాటక రాష్ట్రం సేడం తదితర ప్రాంతాల నుంచి మేకలు, గొర్రెలను అపహరించి ఆయా పట్టణాలకు తరలించే అక్రమాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున బొంరాస్‌పేట చెరువు వద్ద ఎర్టిగా కారు నిలిపి ఉండడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అనుమాతంతో ఆరా తీశారు. వాహనంలో ఉన్న సంజయ్‌కుమార్, జగత్‌పాల్, రోషన్, టైగర్‌ను అరెస్టు చేసి విచారించగా వారు నేరం అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


