హిందువులంతా సంఘటితమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

హిందువులంతా సంఘటితమవ్వాలి

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

కుల్కచర్ల: హిందూ సంస్కృతి, సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలని వక్తలు ప్రథమేశానంద, యాదగిరి, హైందవి అన్నారు. శనివారం రాత్రి కుల్కచర్ల మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హిందూమత రక్షణ మనందరి భాధ్యత అన్నారు. అన్యమతస్తులు లౌకికవాదమంటూ హిందూమతాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిందువులపై జరుగుతున్న దాడులను హిందువులు సైతం మన దగ్గర కాదులే, మనకు ఎందుకులే అనే విధానం అవలంబించడంతో ఐక్యత దెబ్బతిన దాడులు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ నాయకులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement