శతం.. గురుకులం సొంతం | - | Sakshi
Sakshi News home page

శతం.. గురుకులం సొంతం

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

ఆందోళన చెందకుండా..

కొడంగల్‌ రూరల్‌: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో సర్కారు పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపారు. చాలా బడుల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు శతశాతంతో ప్రభంజనం సృష్టించారు. బీసీ గురుకుల ప్రిన్స్‌పాల్‌ కె.నగేష్‌, సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌ బి.రామదాసు, ఉపాధ్యాయ సిబ్బంది సమష్టి కృషి, విద్యార్థుల పట్టుదల ఇందుకునిదర్శనమని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెన్నుతట్టి.. ప్రోత్సహించి

బోధన సిబ్బంది.. ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తూ, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ ప్రోత్సహించారు. వెనకబడిన వారిని వెన్నుతట్టారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేస్తూ మెరికలుగా తీర్చిదిద్దారు. బీసీ గురుకులంలో 68 మందికి 68 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 65 మందికి 65 మంది ఉత్తమ మార్కులతో వంద శాతం పాసయ్యారు. పాఠశాలలో 500లకు పైగా మార్కులను 16 మంది విద్యార్థులు సాధించారు. సోలోమన్‌ 540, పి.సన్ని 537, భవాని ప్రసాద్‌, వరుణ్‌ సందేష్‌లు 533 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌ బి.రామదాసు తెలిపారు.

పది ఫలితాల్లో ప్రభంజనం

తోడ్పడిన ప్రత్యేక తరగతులు

హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

పదో తరగతి పరీక్షల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. ఉపాధ్యాయులు వె న్నంటి ఉంటూ.. ప్రోత్సహించారు. సందేహాలను నివృత్తి చేస్తూ భయాందోళన చెందకుండా చేశారు. ఆందోళన చెందకుండా 540 మార్కులు సాధించాను.

– సోలోమన్‌,

సాంఘిక సంక్షేమ గురుకులం, కొడంగల్‌

సమష్టి కృషితో సాధ్యం

ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తూ.. వెనకబడిన వారికి సబ్జెక్టుపై అవగాహన కల్పించాం. వారితో మమేకమై ఆందోళన చెందకుండా చేశాం. పట్టుదలతో చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ చూపారు.

– బి.రామదాసు, సాంఘిక సంక్షేమ గురుకుల, ప్రిన్సిపాల్‌, కొడంగల్‌

Advertisement
 
Advertisement
Advertisement