ఇరువర్గాల ఘర్షణ.. అంబులెన్స్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల ఘర్షణ.. అంబులెన్స్‌పై దాడి

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

కుల్కచర్ల: ఇరువర్గాల గొడవలో అంబులెన్స్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది, పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శంకర్‌నాయక్‌, నారాయణ కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో శంకర్‌నాయక్‌ కుటుంబీకులు 108కి ఫోన్‌ చేసి తాము గాయపడ్డామని చెప్పడంతో అంబులెన్స్‌ వచ్చి వారిని కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఈ క్రమంలో నారాయణ కుటుంబీకులు అంబులెన్స్‌ రాకముందే ఆస్పత్రికి చేరుకుని శంకర్‌ నాయక్‌ కుటుంబీకులపై దాడికి ప్రయత్నించారు. దీంతో వారు వాహనంలో ఉండిపోయారు. ఇది గమనించిన నారయణ కుటుంబీకులు ఇటుకలతో అంబులెన్స్‌పై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. అంబులెన్స్‌పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement