డ్రంకెన్‌ డ్రైవ్‌తో ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌ డ్రైవ్‌తో ప్రమాదం

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

ధారూరు: మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. శనివారం రాత్రి రుద్రారం గ్రామానికి చెందిన బంటు వెంకటయ్య, అతని బావ పాండుతో కలిసి వికారాబాద్‌కు వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. ధారూరు సమీప ట్రాక్టర్‌ గ్యారేజీ సమీపంలో వీరి బైక్‌ను కారు ఢీకొట్టింది. కారు డ్రైవింగ్‌ చేస్తున్న పెద్దెముల్‌ గ్రామానికి చెందిన ద్యావరి జయవర్దన్‌రెడ్డి మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి ఈడ్చుకెళ్లాడు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. క్షతగాత్రుడి తండ్రి బంటు కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రైవర్‌పై కేసు

Advertisement
 
Advertisement
Advertisement