కేశంపేట: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోల్కోనిగుట్ట తండా పంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్టు గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ల డ్రైవర్లు ఉమేష్, విక్రమ్‌తో పాటు యజమాని రాఘవేందర్‌పై కానిస్టేబుల్ శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.


