అభివృద్ధిని చూసి చేరికలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని చూసి చేరికలు

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

షాబాద్‌: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్‌ పార్టీ లో చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొమరబండ సర్పంచ్‌ కుక్కల పద్మమ్మ గోపాల్‌, గ్రామస్తులు బసిలింగం, చిన్న శేఖర్‌, హరీష్‌, రాము, హరీష్‌, తదితరులు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు వస్తాయన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కావలి చంద్రశేఖర్‌, నాయకులు ధర్మభిక్షం, గంధం అంజయ్య, మంగలి రాములు, రాజు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

Advertisement
 
Advertisement
Advertisement