● అమ్ముకుంటే నష్టపోతారు
● రెండో హైదరాబాద్‌గా.. వికారాబాద్
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
ధారూరు: భవిషత్తులో వికారాబాద్ రెండో హైదరాబాద్‌గా అభివృద్ధి చెందనుందని, ఎవరూ కూడా తమ భూములు విక్రయించవద్దని శాససనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం ధారూరు మండలం గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధి వెనకతండా, కుక్కిందలో తొలుత లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని, అనంతరం నాగసమందర్‌లో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించి మాట్లాడారు. వికారాబాద్ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధు లు సమకూర్చి, అభివృద్ధి చేస్తానని చెప్పారు. దీంతో మన ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవ కాశం ఉందని తెలిపారు. ఇప్పుడు భూములు అ మ్ముకుంటే.. ఆ తరువాత చింతించాల్సి వస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో రా ష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దు తూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, కుక్కింద, గురుదోట్ల సర్పంచు లు మణెమ్మ, రాములు, కాంగ్రెస్ కమిటీ జిల్లా కా ర్యదర్శి మహ్మద్ బాబాఖాన్, నాయకులు పాల్గొన్నారు.


