బంక్‌లు మూసి ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

బంక్‌లు మూసి ఇబ్బంది పెట్టొద్దు

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

ధారూరు: ఉద్దేశ పూర్వకంగా బంక్‌లను మూసేసి, వాహనదారులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని తహసీల్దార్‌ సాజిదాబేగం హెచ్చరించారు. హరిదాస్‌పల్లి సమీపంలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో స్టాక్‌ ఉన్నప్పటికీ గురువారం సాయంత్రం మూసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బంక్‌ మూసి ఉండటాన్ని గమనించిన డీసీసీ కార్యదర్శి మమ్మద్‌ బాబాఖాన్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఉన్నా బంక్‌ ఎందుకు మూసేశారని నిలదీశారు. రాత్రి వేళ బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, సొమ్ము చేసుకునే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు సిబ్బంది లేక తెరవలేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిషయాన్ని వెంటనే తహసీల్దార్‌తో పాటు ధారూరు సీఐ రఘురామ్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ హెచ్చరికలతో బంక్‌ తెరిచిన నిర్వాహకులు ప్రెట్‌ల్‌, డీజిల్‌ పంపిణీ చేశారు.

తహసీల్దార్‌ సాజిదాబేగం

Advertisement
 
Advertisement
Advertisement