ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ ఆమనగల్లు: స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌ నాయక్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన్ని సీఅండ్‌ డీఎంఏ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. అలాగే పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఎస్‌.రాఘవేందర్‌రెడ్డిని ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించారు. 24న దివ్యాంగుల జిల్లా సదస్సు ఇబ్రహీంపట్నం: దివ్యాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై మే 24న ఇబ్రహీంపట్నంలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని మార్కెట్‌ యార్డులో గురువారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 1 నుంచి 10వ తేదీ వరకు దివ్యాంగుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. 24న నిర్వహించే సదస్సులో దివ్యాంగుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జెర్కొని రాజు, ప్రమోద్‌కుమార్‌, పాండు రంగారెడ్డి, విజయ్‌, ఎల్లయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. నూతన నియామకం కడ్తాల్‌: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని కర్కల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఎగిరిశెట్టి వీ రయ్య నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని విద్యానగర్‌ బీసీ భవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య చేతుల మీదుగా నియా మక పత్రం అందుకున్నారు. బీసీ హక్కుల కోసం, బీసీల జనాభా దామాషా ప్రకా రం రావాల్సిన రిజర్వేషన్‌ల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం పనిచేయాలని కృష్ణయ్య సూచించినట్లు వీరయ్య తెలిపారు. వీరయ్య నియామంకపై బీసీ నాయకులు దోనాదుల మహేశ్‌తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ సుధాకర్‌ 11న మెగా జాబ్‌ మేళా

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ సుధాకర్‌ బండారి ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థిపై ఆయన 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఓటింగ్‌ నిర్వహించారు. డాక్టర్‌ అనురాగిణిరెడ్డి, డాక్టర్‌ వినోద్‌, డాక్టర్‌ వినయ్‌, డాక్టర్‌ చంద్రకృష్ణ, డాక్టర్‌ శ్రీలత, డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ శ్రీకర్‌, డాక్టర్‌ గాయిత్రీలతో కూడిన వైద్య బృందం ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించింది.

హుడాకాంప్లెక్స్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 11వ తేదీన మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్‌ మేళాలో 162 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్టు తెలిపారు. ఐటీ, హెల్త్‌ కేర్‌, ఇండస్ట్రియల్‌, ఫార్మా, రిటైల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, సేవా రంగం తదితర అనేక విభాగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, ఎంబీఏ వంటి అర్హతలతో ఉన్న అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుని, అదే రోజున ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://satg. `telangana.gov.in/prajapalana/ వెబ్‌ లింక్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తమ బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్‌ కార్డు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాల్సిందిగా కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement