● అంతర్గత సీసీ రోడ్లకు స్టాండింగ్ కమిటీ పచ్చజెండా
● తుర్కయంజాల్, తొర్రూరులో రూ.17.42 కోట్లతో పనులు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో విలీనమైన తుర్కయంజాల్ వార్డులోని ఏవీ నగర్ ఫేజ్–3, ఫేజ్–4, ఊషయ్య కాలనీ, లక్ష్మీగణపతి హ్యాపీ హోమ్స్, ఎస్సీ బస్తీ, సినర్జీ హోమ్స్, అభ్యుదయ నగర్, ద్వారకానగర్, శ్రీనివాస సిలికాన్ సిటీల్లో రూ. 5 కోట్లతో అంతర్గత రహదారులు నిర్మించనున్నారు. మంగళవారం స్పెషలాఫీసర్ జయేశ్‌రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏవీనగర్ ఫేజ్–2, సాయిబృందావన్ కాలనీ, నల్లా నారాయణ కాలనీ, తుర్కయంజాల్ ఓల్డ్ విలేజ్‌ల్లో అంతర్గత రోడ్లకు మరో రూ. 5 కోట్లతో పనులకు ఆమోదం తెలిపింది. అలాగే.. శివసాయినగర్, ఆరెంజ్ అవెన్యూ కాలనీ, ఏవీనగర్ ఫేజ్–1, ఆదిత్యనగర్, మ్యాట్రిక్స్ రిచ్‌వ్యాలీ, టీచర్ గ్రిల్డ్‌కాలనీల్లో అంతర్గత రోడ్లకు రూ.3.92 కోట్ల పనులకు, తొర్రూరు వార్డులోని శ్రీ శ్రీనివాస రంగాపురం కాలనీ, శ్రీగణేశ్‌రంగాపురం కాలనీ, ఓంగణేశ్‌నగర్, గణేశ్‌నగర్, సాయిబృందావన్‌కాలనీ, జీవీఆర్ కాలనీ, సామ రెసిడెన్సీ, దుర్గా అంజనాద్రి కాలనీల్లో రూ. 3.50 కోట్లతో అంతర్గత రోడ్లకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం అంచనా వ్యయం రూ.17.42 కోట్లు. రెండంతస్తులతో మూసారాంబాగ్ సర్కిల్ కార్యాలయనిర్మాణానికి రూ.5.90 కోట్ల అంచనా వ్యయంతో పనులకు కూడా ఆమోదం తెలిపింది.


