మొయినాబాద్: పెట్రోల్, డీజిల్ వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ వచ్చిందంటే చాలు వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి మొయినాబాద్‌లోని అన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే కనిపించాయి. మధ్యాహ్నం తరువాత రెండు బంకుల్లో స్టాక్ రావడంతో భారీగా వాహనాలు క్యూ కట్టాయి. ఒక్కో వాహనదారుడు ట్యాంక్ ఫుల్ చేయిస్తుండడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో వెనకాల వచ్చే వాహనదారులకు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది.


