శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
పహాడీషరీఫ్: హత్యలు, హత్యాయత్నాలతో ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి భంగం కలిగించే రౌడీషీటర్లను ఉక్కుపాదంతో అణచివేస్తామని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకీ రెడ్డి హెచ్చరించారు. బా లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 15 మంది రౌడీషీటర్లకు గురువారం ఆయన, ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు.రౌడీషీటర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. గతంలో ఏం చేసేవారని తెలుసుకున్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, రాత్రి 10 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని, అనంతరం బయటికి వెళ్లరాదన్నారు. ఏదైనా కేసులో ప్రమేయం అయినట్టు తేలితే పీడీ యాక్ట్, నగర బహిష్కరణకు సీపీకి ప్రతిపాదిస్తామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డి సూచనల మేరకు బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల ప్రతి కదలికపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. స్టేషన్ పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 57 మందిపై రౌడీషీట్ కొనసాగుతోందని వివరించారు. కౌన్సెలింగ్‌లో ఎస్సైలు సుధాకర్, ప్రసాద్ పాల్గొన్నారు.


