కట్టమైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
మొయినాబాద్: అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులు దోచుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సురంగల్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్ పెద్దచెరువు కట్టపై ఉన్న మైసమ్మ దేవాలయంలోని హుండీని దుండగులు రాత్రి వేళ ధ్వంసం చేశారు. అందులో ఉన్న డబ్బులు దొంగిలించి హుండీని ఆలయం నుంచి 50 మీటర్ల దూరంలో పడేశారు. గురువారం ఉదయం చెరువుకట్టపైకి వెళ్లిన మున్సిపల్ సిబ్బంది ధ్వంసమైన హుండీని గమనించి గ్రామస్తులకు తెలియజేశారు. స్థానికులు పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీలో సేకరించారు. సురంగల్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద హుండీని దొంగలించడం ఇప్పటికీ మూడోసారి కావడం గమనార్హం.


