సర్పంచులుగా అక్కాచెల్లెళ్లు
మహేశ్వరం: మూడో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్కాచెల్లెళ్లు సర్పంచ్‌లుగా గెలుపొందారు. మండల పరిధిలోని దిలావార్‌గూడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సభావత్ మంజుల(అక్క) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోత్వాల్ చెర్వుతండా గ్రామ సర్పంచ్‌గా జాటోత్ సుజాత(చెల్లి) గెలుపొందారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. వీరి పుట్టినిళ్లు దుబ్బచర్ల గ్రామం. మంజుల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలవగా, సుజాత బీఆర్‌ఎస్ సపోర్ట్‌తో విజయం సాధించారు. పార్టీలు వేరైనా గ్రామ అభివృద్ధి విషయంలో చర్చించుకుంటామని వారు తెలుపుతున్నారు. సోదరీమణులు గెలవడంతో వారి బంధువులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


