తమ్ముడిపై అన్న విజయం
మహేశ్వరం: మండల పరిధిలోని పెండ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి తోడబుట్టిన అన్నదమ్ములు పోటీ పడ్డారు. ఈ పోరులో తమ్ముడిపై అన్న విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి జైత్వారం జగనోహ్మన్‌రెడ్డి(అన్న), బీజేపీ బలపర్చిన అభ్యర్థి జైత్వారం శ్రీధర్‌రెడ్డి(తమ్ముడు) పోటీ పడ్డారు. బుధవారం ఫలితాల్లో జగన్మోహన్‌రెడ్డి 143 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. జగన్మోహన్‌రెడ్డికి 565 ఓట్లు, శ్రీధర్‌రెడ్డికి 422 ఓట్లు వచ్చాయి.


