ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి
తుక్కుగూడ: కుష్టు వ్యాధి నివారణ కోసం ఇంటింటికీ తిరిగి, ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి అన్నారు. కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో మంగళవారం వైద్య సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అనుమానం ఉన్న వారిని దగ్గరలోని ఆరో గ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య ఉప అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా పార మెడికల్ అధికారి సులోచన, సిబ్బంది పాల్గొన్నారు.
కేన్సర్ వ్యాక్సిన్ అందించాలి
14 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ గర్భాశయ కేన్సర్ వ్యాక్సిన్ అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితా దేవి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం హ్యూ మన్ పాపిలోనా వైరస్ వ్యాక్సిన్‌పై వైద్య సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యా క్సిన్‌ను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా అందిస్తోందని, అర్హులైన ఆడపిల్లలందరికీ ఒక డోస్ చొప్పున ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టీపీఎఫ్ మహాసభలను జయప్రదం చేయండి
షాద్‌నగర్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ ప్రభాకర్ కోరారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం టీపీఎఫ్ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోకన్వీనర్ అర్జునప్ప, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య, ప్రజా కళామండలి జిల్లా కన్వీనర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
షాద్‌నగర్‌రూరల్: పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థినులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, మైక్రోబయోలజీ హెడ్ కళాజ్యోతి, బోటనీ హెడ్ స్పందన తదితరులు పాల్గొన్నారు.
రేపు మెగా హెల్త్ క్యాంపు
మీర్‌పేట: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్, హైదరాబాద్ శాలివాహన లయన్స్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18న (గురువారం) మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీర్‌పేట ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లోని అక్షర టెక్నో స్కూల్‌లో మలక్‌పేట యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించే హెల్త్‌క్యాంప్‌కు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి
ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి


