విద్యతోనే మార్పు సాధ్యం
మంచాల: విద్యతోనే మార్పు సాధ్యమని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకే ప్రాంగణంలో ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండడంతో అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇంటర్నల్ రోడ్లు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్‌రావు, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ వెంకట ప్రసాద్, ఎంఈఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.


