అప్రమత్తంగా ఉండాలి
మహేశ్వరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులు, అధికారులకు సహకరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఏసీపీ జానకిరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమతి లేని వారిని, ఓటరు కానివారిని పోలింగ్ బూత్‌ల్లోకి అనుమతించొద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


