ఉపాధి హామీ పేరు మార్చడం సరికాదు
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీసతీష్
మొయినాబాద్ రూరల్: మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ అన్నారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఎన్డీఏ సర్కార్‌పై పోరాటం తప్పదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధిస్తున్నారని తెలిపారు.


