తొలి ఘట్టం ఆరంభం
సర్పంచ్‌కు దాఖలైన నామినేషన్లు
పంచాయతీ పోరుకు నామినేషన్ల పర్వం మొదలు
● మొదటిరోజు సర్పంచ్‌లకు 145, వార్డు సభ్యులకు 119 దాఖలు
● ఆయా కేంద్రాల వద్ద నేతల హడావుడి
షాద్‌నగర్: ఎన్నికల సం‘గ్రామానికి’ ‘తొలి’ ఘట్టం ప్రారంభమైంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మొదటిరోజు ఎన్నికల బరిలో నిలబడే సర్పంచు, వార్డు సభ్యులకు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం సర్పంచ్ కోసం 145, వార్డు కోసం 119 దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో షాద్‌నగర్, శంషాబాద్ పరిధిలో 174 పంచాయతీలు, 1,530 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
వార్డులకు దాఖలైన నామినేషన్లు
వార్డు సభ్యుడి కోసం ఫరూఖ్‌నగర్‌లో 19, జిల్లేడు చౌదరిగూడలో 5, కేశంపేటలో 7, కొత్తూరులో 22, కొందుర్గులో 25, నందిగామలో 10, శంషాబాద్‌లో 31 నామినేషన్లు దాఖయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌లో 15 క్లస్టర్లు, కేశంపేటలో 9, జిల్లేడు చౌదరిగూడలో 6, కొందుర్గులో 6, నందిగామలో 5, కొత్తూరులో 4, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్‌లో 7 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మొదటిరోజు నామినేషన్ల కేంద్రాల వద్ద ఆశావహులు హడావుడి చేశారు. అధికారుల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవడం, పంచాయతీల్లో పన్నులు చెల్లించడం, బలపరిచే అభ్యర్థులతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో సందడి నెలకొంది. కొత్తూరు మండలం మల్లాపూర్‌లోని నామినేషన్ కేంద్రాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు.
మండలం మొత్తం జీపీలు దాఖలైనవి
ఫరూఖ్‌నగర్ 47 34
జిల్లేడుచౌదరిగూడ 24 30
కేశంపేట 29 24
కొత్తూరు 12 11
కొందుర్గు 22 13
నందిగామ 19 16
శంషాబాద్ 21 17
తొలి ఘట్టం ఆరంభం


