గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆదివారం జింక మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గునుగల్ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను సాగర్ రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కళేబరాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. జింక మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


