నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
అనంతగిరి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు వికారాబాద్ మండలంలో 21 సర్పంచ్ స్థానాలకు గాను 30 నామినేషన్‌లు రాగా, 182 వార్డు సభ్యుల స్థానాలకు 23 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఈ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సుధీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఆర్‌ఓలకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్‌ల ప్రక్రియ సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటిరోజు మదన్‌పల్లి, అత్వెల్లి, పెండ్లిమడుగు, పీలారం, రాళ్ల చిట్టంపల్లి, ద్యాచారం, పాతూర్ గ్రామాల నుంచి నామినేషన్ దాఖలు కాలేదు.
వికారాబాద్ అదనపు కలెక్టర్ సుధీర్


