ఎయిడ్స్‌.. నివారణే మార్గం | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌.. నివారణే మార్గం

Dec 1 2025 9:56 AM | Updated on Dec 1 2025 9:56 AM

ఎయిడ్స్‌.. నివారణే మార్గం

ఎయిడ్స్‌.. నివారణే మార్గం

బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

హెచ్‌ఐవీ ఉన్నవారికి మద్దతు ఇచ్చేందుకు, ఎయిడ్స్‌తో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళికి ఎయిడ్స్‌ డే ఒక సందర్భం. వ్యాధి తొలికేసు నమోదై దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ సందేహాలు, అపోహలు తొలగలేదు. అవగాహనతో ప్రశాంతమైన జీవనం కొనసాగించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీ

జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కేసులు

నేడు ప్రపంచ ఎయిడ్స్‌ డే

నవాబుపేట: జబ్బులు అనేక రకాలు. అందులో ప్రాణాంతకరమైనవి, భయంకరమైన వ్యాధుల్లో ప్రపంచాన్నే వణికిస్తోంది హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యునో వైరస్‌). వైరస్‌ చివరి దశ ఎయిడ్స్‌(హ్యూమన్‌ ఇమ్యునో డెఫిసియెన్సీ సిండ్రోమ్‌) వ్యాధి. వైరస్‌ సోకిన నాటి నుంచి ఇది వ్యాధిగా మారేందుకు కొన్ని ఏళ్లు పడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) చెబుతోంది. కానీ వైరస్‌ సోకిన వారు మానసికంగా కుంగిపోతూ వ్యాధ/కి దగ్గరవుతారు. వ్యాధికి చికిత్స లేదు. వైరస్‌ను అదుపు చేస్తూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే మార్గాలున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ ఏఆర్‌టీ (యాంటీ వైరల్‌ థెరపీ)ని సమర్థవంతమైన చికిత్సగా ప్రామాణీకరించింది. మందులు, మంచి జీవన శైలితో వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టే మందులున్నాయి. ఇవేమీ తెలియక, బయటకు చెప్పుకోలేక ఎంతోమంది తనవు చాలించారు. హెచ్‌ఐవీ సోకిన వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆస్పత్రుల్లో ఐసీటీసీ కేంద్రాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి సోకిన వారికి ఉచిత చికిత్సలు, మందులు అందజేస్తున్నారు. డిసెంబర్‌ 1న ఎయిడ్స్‌ డే సందర్భంగా వైద్య నిపుణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్దతులను ‘సాక్షి’కి వివరించారు.

తాండూరు, వికారాబాద్‌లో ఏఆర్‌టీ కేంద్రాలు

హెచ్‌ఐవీ బారిన పడిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్‌, అనంతగిరి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరు మాసాల పాటు చికిత్స పొందిన రోగులకు ప్రతీనెల మందులను అందించేందుకు తాండూరు, వికారాబాద్‌లలో సహాయక ఏఆర్‌టీ కేంద్రాలు పని చేస్తున్నాయి.

శిశువులకు డీఎస్‌ఏ–పీసీఆర్‌

హెచ్‌ఐవీ సోకిన తల్లుల నుంచి బిడ్డలకు హెచ్‌ఐవీ సోకింది లేనిది తెలుసుకునేందుకు కనీసం 18 నెలల సమయం పడుతుంది. ఇటీవల డీఎస్‌ఏ–పీసీఆర్‌ పరీక్ష అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో శిశువు ఏడు రోజుల వయస్సులో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించి చికిత్సను ప్రారంభించి పూర్తిగా వైరస్‌ లేకుండా నివారించే అవకాశం ఉంది.

సంక్రమణ ఎలా?

● రక్షణ లేకుండా సెక్స్‌ చేయడం, వ్యాధి సోకిన వారి రక్తం ఎక్కించడం, హెచ్‌ఐవీ ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజిలు ఇతరులకు వాడడం, వారికి వాడిన సూదితో మరొకరికి పచ్చబొట్లు వేయడం. తలనీలాలు, షేవింగ్‌ చేసేప్పుడు బ్లేడ్‌లు వాడడం తదితర కారణాలు.

● తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంది.

జాగ్రత్తలు

● కండోమ్‌ వాడడం

● సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం, హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్‌

● పౌష్టికాహారం, విశ్రాంతి, వ్యాయామం

● సమయానికి మందులు

అపోహలు

● దోమకాటు, కుక్కకాటు, దగ్గు, తుమ్ములతో సంక్రమించదు

● వ్యాధిగ్రస్తుని దుస్తులు ధరించడం, కలిసి జీవించడం, పనిచేయడం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement