బ్రహ్మయ్య మృతి పేదలకు లోటు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
యాచారం: సీపీఎం సీనియర్ నాయకుడు పెండ్యాల బ్రహ్మయ్య అకాల మృతి పేద ప్రజలకు తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. గాండ్లగూడెం గ్రామంలో ఆదివారం బ్రహ్మయ్య మృతదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బ్రహ్మయ్య సీపీఎంలో మండల కార్యదర్శిగా, ప్రజా సంఘాల్లో పనిచేసి పేద ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆశయాల సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నాయకులు జంగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్, భూపాల్, నర్సింహ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదల సమస్యలపైనే పోరాటం
పెండ్యాల బ్రహ్మయ్య తన జీవితం మొత్తం పేద ప్రజల సమస్యలపైనే పోరాటం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మయ్య మృతి చెందినట్లు తెలుసుకుని గ్రామంలోని ఆయన మృతదేహనికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.


