ఏకగ్రీవ నిర్ణయంతో సుజాత నాయక్ విజయం | Sujata Nayak unanimous election as Sarpanch | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవ నిర్ణయంతో సుజాత నాయక్ విజయం

Nov 30 2025 10:31 AM | Updated on Nov 30 2025 12:21 PM

Sujata Nayak unanimous election as Sarpanch

రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని.. తండాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. మండల పరిధిలోని దేవునిగుడితండా పంచాయతీకి సుజాత హన్మంత్‌ నాయక్‌ను సర్పంచ్‌గా, రవి, శ్రీను, లక్ష్మి, దేవి, రుక్మణ్‌, నీల, శంకర్‌, అంజమ్మను వార్డు సభ్యులుగా ఎంపిక చేసుకున్నారు. సర్పంచ్‌ అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్‌, వార్డు సభ్యులు ఒక్క సెట్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అభ్యర్థి సుజాత మాట్లాడుతూ.. గ్రామస్తులు తనపై నమ్మకంతో ఏకగ్రీవానికి కృషి చేశారని, అందరి సహకారంతో గ్రామంలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కన్హా పంచాయతీ ఏకగ్రీవం
షాద్‌నగర్‌: నందిగామ మండల పరిధిలో ప్రఖ్యాతి గాంచిన ధ్యాన మందిరం ఉన్న కన్హా పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్‌ కోసం ఒకరు, 8 వార్డుల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement